కేసులు పెరగకముందే చర్యలు చేపట్టండి.. సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి వినతి..!

Tuesday, March 23rd, 2021, 03:03:26 AM IST


తెలంగాణలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. ప్రజలు జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం, ఇటీవల స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో కేసుల సంఖ్య పెరుగుతుంది. అయితే కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రంలో మళ్ళీ లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కరోనా తీవ్రత పెరుగుతుండడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు ఓ విజ్ఞప్తి చేశారు.

అయితే రాష్ట్రంలో కరోనా ప్రభావం మళ్ళీ పెరుగుతుందని అందుకనే వివాహాలకు 50 మందికి మించకుండా పరిమితి పెట్టాలని కోరారు. కరోనా కేసులు పెరగకముందే చర్యలు చేపట్టాలని అన్నారు. హోలీ వేడుకలకు అందరూ దూరంగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. పండుగల కంటే ప్రాణాలు ముఖ్యమని ప్రజలు ఆలోచించాలని హితవుపలికారు. మాల్స్‌ని మూసివేయాలని, పండుగలకు జాగ్రత్తలు తీసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు.