చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ ఇక్బాల్!

Tuesday, August 4th, 2020, 01:37:20 AM IST


ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో గత కొద్ది రోజులుగా రాజధాని వికేంద్రీకరణ విషయం లో ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. టీడీపీ, జన సేన పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరొకసారి చంద్రబాబు నాయుడు వైఖరి పై ఎమ్మెల్సీ ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,ఎంపీ లు రాజీనామా లు చేసి, అమరావతి అజెండా తో పోటీ చేయాలి అని సవాల్ చేస్తూ విసిరారు. తెలుగు దేశం పార్టీ కి ప్రజలు మరొకసారి బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు అని వ్యాఖ్యానించారు.

అయితే పలు కమిటీలు సైతం రాజదాని వికేంద్రకరణ వైపే మొగ్గు చూపాయి అని అన్నారు. శ్రీబాగ్ నుండి శివ రామకృశ్ణన్ కమిటీలు సైతం ఇలానే చెప్పాయి అని అన్నారు. అయితే అన్ని ప్రాంతాల అభివృద్ధి సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అని ఇక్బాల్ అన్నారు. అయితే అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ తెలుగు దేశం పార్టీ నేతల పై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయి అని ఇక్బాల్ మరొకసారి తెలిపారు. ఈ విషయం లో పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత కోల్పోయారు అని తేల్చి చెప్పారు. అంతేకాక చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజల్ని గుండాల్లా చిత్రీకరించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.