సీఎం కేసీఆర్‌ను కలిసిన గోరేటి వెంకన్న.. కూతురు పెళ్ళికి ఆహ్వానం..!

Monday, December 7th, 2020, 10:03:35 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కవి, రచయిత గోరేటి వెంకన్న కలిశారు. తన కుటుంబ సభ్యులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన గోరేటి వెంకన్న తన కూతురు పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను కూడా సీఎం కేసీఆర్‌కు అందచేశారు. ఈ సందర్భంగా గోరేటి కుటుంబానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే ఇటీవల గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలను ప్రభుత్వం తెలంగాణ భర్తీ చేసింది. ఇందులో ఎస్సీ కోటాలో ఉద్యమకారుడు, ప్రజాకవి గోరెటి వెంకన్నకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించగా, బీసీ కోటాలో మాజీమంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్యకు, ఓసీ కోటాలో వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్‌లకు అవకాశం కల్పించారు.