నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

Wednesday, March 17th, 2021, 08:40:18 AM IST

తెలంగాణ రాష్ట్రం లో ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కి సంబంధించి పోలింగ్ పూర్తి అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ మారథాన్ లా జరగనుంది. ఖమ్మం – నల్గొండ – వరంగల్ కి సంబందించిన ఎమ్మెల్సీ ఓట్లు మరియు మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ కి చెందిన ఎమ్మెల్సీ ఓట్లను లెక్కించనున్నారు. మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ సిబ్బంది పని చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్ష పార్టీ నేతలు ఈ కౌంటింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యం గా హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక కీలకం కానుంది. 3.57 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి.