ఏపీ, తెలంగాణలో వాయిదా పడిన ఎమ్మెల్సీ ఎన్నికలు..!

Thursday, May 13th, 2021, 07:30:21 PM IST

కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతున్న నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే ఏపీలోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండగా, తెలంగాణలోని ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే నెల 3న ముగియనుంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అందుకే ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది.

తెలంగాణలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైఎస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, సభ్యులు కడియం శ్రీహరి, ఫరీరుద్దీన్‌, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు అలాగే గవర్నర్‌ కోటాలో భర్తీ అయిన ప్రొఫెసర్‌ ఎం శ్రీనివాస్‌రెడ్డిల స్థానాలు ఖాలీ కానున్నాయి. ఇక ఏపీలో పదవీ విమరణ చేయనున్న ఎమ్మెల్సీల్లో మండలి చైర్మన్ షరీఫ్ కూడా ఉన్నారు. దీంతో అటు తెలంగాణలో, ఏపీలో ఎవరికి ఈ ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.