ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి

Friday, January 1st, 2021, 01:04:28 PM IST

వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి అనారోగ్యం కారణంగా మృతి చెందారు. గత నెల 13 వ తేదీన ఈయనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం తో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రిలో చేరిన ఆయనకి వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. పరిస్థతి విషమించడంతో మృతి చెందారు. చల్లా రామకృష్ణారెడ్డి కి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భౌతిక కాయాన్ని స్వగ్రామం కి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ హయాంలో పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన ఈయన, కాంగ్రెస్ పార్టీ లో కూడా పని చేశారు. ఈయన మృతి పట్ల వైసీపీ నేతలు, పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.