కాంగ్రెస్ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి..!

Thursday, March 18th, 2021, 07:09:19 PM IST

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో సమయంలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాములు నాయక్ కాంగ్రెస్ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే కొంత మంది రెడ్డి నాయకులు, డీసీసీ అధ్యక్షులు తనకు సహకరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించారని, ఈ ఎన్నికల్లో క్యాష్ అండ్ క్యాస్ట్ పని చేసిందని రాములు నాయక్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గానికి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఐదు వేలైనా ఉంటుందని కనీసం ఆ ఓట్లు కూడా తాకు రాలేదని, గతంలో ఏ ఎన్నికలు వచ్చినా కోదండరాం పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చేవి కాదని, కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు ఇన్ని ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అయితే ఈ ఎన్నీలపై గాంధీ భవన్‌లో సమావేశం పెట్టి అన్నీ చర్చిస్తామని, నేను గెలిస్తే చాలా మందికి ఇబ్బంది అవుతుందన్న కారణంగానే నన్ను ఓడగొట్టారని ఆరోపించారు.