కరోనా పేరు చెప్పి పారిపోయిన మీకు కుప్పం మీద ఛాలెంజ్ అవసరమా?

Wednesday, December 23rd, 2020, 05:34:36 PM IST


వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ మంగళగిరిలో ఓడిన విషయం, కుప్పం లో ఇక చంద్రబాబు పరిస్థతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా బదులు ఇచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల కి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంటే, కరోనా పేరు చెప్పి పారిపోయిన మీకు కుప్పం మీద ఛాలెంజ్ అవసరమా అంటూ బుద్దా వెంకన్న విజయసాయి రెడ్డి ను సూటిగా ప్రశ్నించారు. నీకేం పోయింది ఓట్లతో సంబంధం లేని రాజ్యసభ ఎంపీ వి అంటూ విమర్శించారు. రాజీనామా అంటూ సవాల్ విసిరి 151 మందిని ఇరికించేస్తున్నావ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు ఎన్నికలు పెట్టే దమ్ము ఉంటే తెలుగు దేశం పార్టీ దగ్గర కొన్న ఎమ్మెల్యే లతో ఎప్పుడో రాజీనామా చేయించేవారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమంతా ఎందుకు సాయి రెడ్డి, మూడు రాజధానుల కి మద్దతు ఇచ్చే మంగళగిరి ఎమ్మెల్యే కరకట్ట కమల్ హాసన్ తో రాజీనామా చేయించు అంటూ విజయసాయి రెడ్డి పై వరుస విమర్శలు చేశారు.