డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు

Wednesday, September 16th, 2020, 12:03:10 AM IST


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్ల ను అందించనుంది. అయితే ఇందుకోసం ప్రజలు ఎవరూ కూడా దళారులను ఆశ్రయించవద్దు అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. చింతల్ లో క్యాంప్ కార్యాలయంలో ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ప్రజా దర్బార్ చర్చ లో ఎమ్మెల్యే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అర్హులు అయిన ప్రతి ఒక్కరికీ పక్కా ఇండ్లను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు తీసుకుంటుంది అని అన్నారు. అయితే నియోజక వర్గం లో ఉన్న ప్రతి బస్తీ ను కూడా సమస్యల రహిత బస్తీ లుగా తీర్చి దిద్దుతాం అని తెలిపారు. అయితే ప్రజల సమస్య ల పరిష్కారం లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే సహించేది లేదు అని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల కి ఎటువంటి సమస్య ఉన్న క్యాంప్ కార్యాలయంకు రావాలి అని, తనకే తెలపాలని సూచించారు. అంతేకాక డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు అని సూచించారు. అంతేకాక అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా సొంతింటి కల నెరవేరుస్తామని తెలిపారు.