ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సరికొత్త విన్నపం..!

Thursday, August 27th, 2020, 12:43:07 PM IST

దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల NEET,JEE పరీక్షలను నిర్వహించేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం విద్యార్థులకు హాల్ టికెట్లను కూడా జారీ చేసింది. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని, పరీక్షలు పేరుతో విద్యార్థుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టవద్దని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పరీక్షలను వాయిదా వేయాలని ప్రధాని మోదీకి సరికొత్తగా విన్నవించారు. ఓ పచ్చని పార్కులో ప్రధాని మోదీ లెన్స్ కెమెరా పట్టుకుని అక్కడున్న వాటిని ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సీతక్క ఆ ఫోటోను షేర్ చేస్తూ సర్ ఆ లెన్స్‌ను కాస్త పక్కకి తిప్పి విద్యార్థుల డిమాండ్లు చూడండి అని కోరింది.