కొమురం భీమ్ టీజర్‌పై సీతక్క ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

Thursday, October 22nd, 2020, 11:11:15 PM IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే దసరా కానుకగా మరియు నేడు కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేస్తూ ఇవాళ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే గతంలో రామ్ చరణ్ లుక్ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించగ, ఎన్‌టీఆర్ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించాడు. అయితే ఆర్ఆర్ఆర్ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్‌టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు ఈ టీజర్ నిజంగా గూస్‌బంప్స్ తెప్పించిందనే చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ టీజర్‌పై ట్విట్టర్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందిస్తూ మన్యం ముద్దుబిడ్డ, మా అన్న, మా ఆదర్శం కొమరం భీమ్ గారి జయంతిన నా ఘన నివాళులు అంటూ మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి అభినందనలు తెలుపుతూ సీతక్క ట్వీట్ చేసింది.