వైసీపీ ఎమ్మెల్యే రోజా కి శస్త్ర చికిత్స… ఆడియో టేప్ విడుదల చేసిన సెల్వమణి

Monday, March 29th, 2021, 01:27:57 PM IST

ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కి శస్త్ర చికిత్స జరిగిన విషయాన్ని ఆమె భర్త సెల్వమని వెల్లడించారు. అయితే చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్ లను నిర్వహించారు. అయితే రోజా కి ఇంకా మరో రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరం అని వైద్యులు అంటున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె భర్త తెలిపారు. ఈ మేరకు ఆమె భర్త సెల్వమనీ ఒక ఆడియో టేప్ విడుదల చేశారు. తనకు ఇది వరకే ఆపరేషన్ నిర్వహించాల్సి ఉందని, కానీ గతేడాది కరోనా, ఈ ఏడాది జనవరి లో ఎన్నికల కారణంగా వాయిదా పడింది అని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం రోజా ఆరోగ్యం కుదుట పడుతుంది అని, ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా సందర్శకులు ఎవరూ కూడా ఆసుపత్రి కి రావొద్దు అంటూ కోరారు. అయితే రోజా త్వరగా కోలుకోవాలని సన్నిహితులు, అభిమానులు కోరుతున్నారు.