టీడీపీ, బీజేపీ చేస్తున్న నీచ రాజకీయాలు మానుకోవాలి – ఎమ్మెల్యే రోజా

Friday, January 8th, 2021, 12:26:42 AM IST

MLA_Roja
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ బీజేపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ లబ్ధీ కోసమే చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వందకు పైగా గుళ్ళను కూలిస్తే ఆనాడు బీజేపీ ఎందుకు నోరు మెదపలేదని రోజా ప్రశ్నించారు. అంతేకాదు బీజేపీ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే గుళ్ళను కూల్చరన్న సంగతిని కూడా బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

అయితే దేవాలయాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వంపై నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని టీడీపీ, బీజేపీ చూస్తుందని రోజా అన్నారు. తిరుపతి ఉపఎన్నిక కోసమే ఈ నీచ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు మీ ఎత్తుగడలను మరోసారి తిప్పి కొట్టడం ఖాయమని అన్నారు. అయితే అన్ని మతాలను, కులాలను గౌరవించే వ్యక్తి సీఎం జగన్ అని అందుకే చంద్రబాబు కూల్చిన ఆలయాలను కూడా పునర్నిర్మించబోతున్నారని అన్నారు. ఇకనైనా టీడీపీ, బీజేపీ నీచ రాజకీయాలు మానుకోవాలని రోజా హితవు పలికారు.