స్టీరింగ్ పట్టి అంబులెన్స్ వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యే రోజా

Wednesday, October 14th, 2020, 12:21:49 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల కి పలువురు ఆకర్షితులు అవుతున్నారు. రాష్ట్రం లో అత్యాధునిక అంబులెన్స్ వాహనాలను తీసుకొచ్చేందుకు కారణం అయిన సీఎం జగన్ ప్రభుత్వానికి జీటివి యాజమాన్యం 10 అంబులెన్స్ వాహనాలను అందజేసింది. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కి ఈ వాహనాలను అందజేయడం తో ఎమ్మెల్యే రోజా మరియు మంత్రి పేర్ని నాని వీటిని ప్రారంభించారు. అయితే ఎమ్మెల్యే రోజా స్టీరింగ్ పట్టుకొని మరి అంబులెన్స్ వాహనాన్ని నడిపారు.

అయితే ఎమ్మెల్యే రోజా అంబులెన్స్ వాహనం ను నడపడం తో ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. అయితే జగన్ పాలన పై ఎమ్మెల్యే రోజా మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోే నే ఎవరూ చేయని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నారు అని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ లో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు అని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్న విషయాన్ని వెల్లడించారు.