బాబు రాజకీయ జీవితం మొత్తం వెన్నుపోట్లు, శవరాజకీయాలకే సరిపోయింది – రోజా

Friday, November 20th, 2020, 01:45:23 PM IST

శుక్రవారం తిరుమలలో శ్రీవారి ను దర్శించుకున్న అనంతరం వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియా తో మాట్లాడారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు జీవితం మొత్తం వెన్నుపోట్లు, శవ రాజకీయాలకే సరిపోయింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పారదర్శకంగా రాజకీయాలు నడుపుతున్నారు అని, తిరుపతి ఎంపీ కరోనా తో మృతి చెందితే, హడావిడిగా అభ్యర్దిని ప్రకటించి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు అంటూ ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు.

14 ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు, కరోనా తో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ప్రజలకు కనీస భరోసా కల్పించలేదు అని ఆరోపించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజల గురించి ఆలోచించకుండా బాబు హైదరాబాద్ లో దాక్కున్నారు అని విమర్శించారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గం వారిని నిలబెట్టుకోవడం కోసం లోకల్ బాడీ ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారు అని అన్నారు. స్థానిక సంస్థల ఫండ్స్ రాకపోతే రాష్ట్ర అభివృద్ది కుంటుపడుతుంది అని ఎన్నికలు పెడితే కరోనా కుంటిసాకులు చూపించి ఎన్నికలు వాయిదా పడేలా చేశారు అని, ఇప్పుడేమో పెట్టాలి అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.