చంద్రబాబు లాగా కుంటిసాకులు చెప్పడం జగనన్న కి తెలియదు – రోజా

Friday, September 11th, 2020, 10:36:05 PM IST

Roja_MLA
ఎమ్మెల్యే రోజా మరొకసారి ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు. అంతర్వేది ఘటన పై ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రథం తగలబడిన ఘటన లో చంద్రబాబు ప్రమేయం ఉంది అని, గతంలో రైలు, రాజధానుల భూములు తగల బెట్టించిన ఘనత చంద్రబాబు ది అని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సీబీఐ రావొద్దు అని ఆనాడు చంద్రబాబు అన్నారు, నేడు సీబీఐ విచారణ కోరుకుంటున్నారు, సీఎం జగన్ చిత్త శుద్ది నిరూపించుకోనేందుకు సీబీఐ విచారణ కి ఆదేశాలు ఇచ్చారు అని రోజా పేర్కొన్నారు.

అయితే వైయస్సార్ ఆసరా పథకం గురించి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.నేడు డ్వాక్రా అక్క చెల్లెమ్మల కి పండుగ రోజు అని, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పథకం ద్వారా హామీని నిలబెట్టుకొన్నారు అని మీడియా సమావేశం లో అన్నారు.ఈ పథకం ద్వారా దాదాపు 90 లక్షల మందికి మేలు జరిగింది అని, ఆర్ధిక ఇబ్బందులు తలెత్తినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని, చంద్రబాబు లాగా కుంటి సాకు లు చెప్పడం జగనన్న కి తెలియదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.