ఓట్ల కోసం గత రాత్రి నుండి తెరాస, ఎంఐ ఎం నేతలు డబ్బులు పంచుతున్నారు

Monday, November 30th, 2020, 03:40:50 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే ఈ మేరకు పలు చోట్ల నిన్న అర్దరాత్రి నుండి తెరాస మరియు ఎం ఐ ఎం పార్టీ కి చెందిన నేతలు డబ్బులు పంచుతున్నారు అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే బహిరంగం గా పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు అని తెలిపారు.పైగా వారికి వత్తాసు పలుకుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే బీజేపీ కార్యకర్తల పై లాఠీ ఛార్జ్ జరిగిన పలు విషయాలను ప్రస్తావించారు రాజా సింగ్. పలు డివిజన్ లలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి అని సూచించారు. అయితే ఎన్నికల కమిషన్ తెరాస కి అనుకూలం గా నిర్వహించాలని భావిస్తోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తెరాస మరియు ప్రతి పక్ష పార్టీ లు అయిన బీజేపీ, కాంగ్రెస్ లకు మద్య మాటల యుద్దాలు నడిచాయి. అయితే మరొకసారి ఇప్పుడు రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి వీటి పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అంతేకాక గ్రేటర్ నగర వాసులు ఈసారి ఎవరికి మద్దతుగా నిలుస్తారు అనేది ఆసక్తి గా మారింది.