టీఆర్ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే – రఘునందన్‌రావు

Tuesday, November 17th, 2020, 03:06:12 AM IST


దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికలలో కూడా దుబ్బాక ఫలితమే పునారావృత్తం అవుతుందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత మంత్రి కేటీఆర్ కళ్లు కిందకు దిగుతాయని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ దగ్గర ప్రత్యేక ప్రణాళికలు రచిస్తుందని అన్నారు.

అయితే గ్రేటర్ ఎన్నికలలో ఎంఐఎంను మేయర్ పీఠంపై కూర్చోబెట్టటానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే, ఎంఐఎంకు ఓటు వేసినట్టే అని అన్నారు. వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓట్లు కొనుగోలుగా మార్చిందని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పేందుకు రెడీ అయ్యారని అన్నారు.