బడ్జెట్ చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోవాల్సిందే – రఘునందన్ రావు

Thursday, March 18th, 2021, 06:34:51 PM IST

తెలంగాణ రాష్ట్ర అర్డిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై బీజేపీ కి చెందిన నేతలు స్పందించారు. బడ్జెట్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గణాంకాలు మేడిపండు చందంగా ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ను చూస్తే కళ్ళు తిరిగి కింద పదిపోవాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు. గల్ఫ్ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల రూపాయలను కేటాయిస్తామని 2014 నుండి ప్రభుత్వం చెబుతూ వస్తుంది అని, కానీ ఇప్పటి వరకూ ఎలాంటి కేటాయింపులు జరగలేదు అని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. అయితే నివాస యోగ్య నగరాల్లో హైదరాబాద్ 4 వ స్ధానం లో ఉండేది అని, ఇవాళ 24 వ స్థానానికి పడిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ కి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అని వ్యాఖ్యానించారు.