హైకోర్టును ఆశ్రయించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు…ఎందుకంటే?

Thursday, November 12th, 2020, 05:04:23 PM IST

దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ రాష్ట్రం లో మాత్రమే కాక, ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చంశనీయం అయింది. ఈ ఎన్నిక ఫలితం కూడా అదే తరహాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ దుబ్బాక ఉపఎన్నిక లో గెలుపొందిన ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రస్తుతం హైకోర్టు ను ఆశ్రయించారు. సిద్దిపేట నొట్ల కట్ల లొల్లి పై హైకోర్టు ను ఆశ్రయించారు ఎమ్మెల్యే.

సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో తన పై నమోదు అయిన ఎఫ్ ఐ ఆర్ ను కొట్టివేయాలని క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు రఘునందన్. ఎన్నికల సమయం లో 18 లక్షల రూపాయలు లభించాయని కట్టుకథ అల్లారు అని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీని పై విచారణ లక్ష్మణ వద్దకు రాగా, ఎమ్మెల్యే ల పై క్రిమినల్ కేసుల దర్యాప్త సి జే ధర్మాసనం చూసుకుంటుంది అని సూచించారు. ఈ కేసు విచారణ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రికిస్త్రికి లక్ష్మణ్ సూచించారు. అయితే ఇప్పుడు ఈ విషయం మరొకసారి హాట్ టాపిక్ గా మారింది.