పోలీస్ భద్రత లేకుండా వరంగల్ లో తిరిగే ధైర్యం ఉందా?

Tuesday, February 2nd, 2021, 07:51:55 AM IST

తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న పరిణామాల పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ రాష్ట్ర పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై మండిపడ్డారు. మంత్రి ఎర్రబెల్లి ఇంట్లో పడుకున్నప్పుడు ఉద్యమం చేశా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఒక్క రోజు పోలీస్ భద్రత లేకుండా వరంగల్ లో తిరిగే ధైర్యం ఎర్రబెల్లికి ఉందా అంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు. అయితే వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఘటనల పై మౌనంగా ఉండటం మంచి పద్దతి కాదు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే రాముడి ను అవమానించిన ఎమ్మెల్యే లు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో నల్ల గుడ్డలతో మౌన నిరసన ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. రాముని ఫోటో తో ర్యాలీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వరంగల్ లో మాట్లాడిన ఎమ్మెల్యే లు, మంత్రులు క్షమాపణలు చెప్పాలి అని, రామాలయం నిర్మాణం లెక్కలు చెప్పడానికి తాము సిద్దం గా ఉన్నట్లు తెలిపారు. అంతేకాక సీఎం కేసీఆర్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ భద్రాద్రి ఆలయానికి రావాలి అంటూ సవాల్ విసిరారు. రామాలయ నిర్మాణం పై సీఎం కేసీఆర్ అభిప్రాయం ఎంటి అంటూ సూటిగా ప్రశ్నించారు. బీజేపీ నాయకులుగా మేం ఎవరి ర్యాలీ లో పాల్గొనడం లేదు అని, హిందువులు గా పాల్గొంటున్నాం అని, తెలంగాణ కిష్కింధ కాండ గా మారాలి అనుకుంటే అది తెరాస విజ్ఞతకే వదిలేస్తున్నాం అని అన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చంశనీయం గా మారాయి.