సభా నియమ నిబంధనలను తెరాస తుంగలో తొక్కింది – ఎమ్మెల్యే రఘునందన్

Monday, March 15th, 2021, 05:52:29 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయో గవర్నర్ ప్రసంగం తో తేలిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. సభాపతి అధికార పార్టీ కనుసన్నల్లో నడవబోరు అని ఆశించాం అని, కానీ బీ ఏ సీ సమావేశానికి బీజేపీ ను అహ్వానించక పోవడం దేనికి సంకేతం అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే బీ ఏ సీ సమావేశానికి బీజేపీ ను పిలవక పోవడం పై స్పీకర్ మరియు సభా వ్యవహారాల మంత్రి సమాధానం చెప్పాలి అంటూ రఘునందన్ డిమాండ్ చేశారు. అయితే గతం లో లోక్ సత్తా నుండి గెలిచిన ఒకే ఎమ్మెల్యే జయ ప్రకాష్ నారాయణ ఉంటే ఆయన్ను పిలిచారు అని రఘునందన్ గుర్తు చేశారు. సభా నియమ నిబంధనలను తెరాస తుంగలో తొక్కింది అని, ప్రజా స్వామ్యం లో ఇది మంచి పద్ధతి కాదు అంటూ చెప్పుకొచ్చారు.