దుబ్బాక పై వివక్ష చూపించడం బాధాకరం – ఎమ్మెల్యే రఘునందన్ రావు

Friday, December 11th, 2020, 03:05:28 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు అధికారులు సిద్దిపేట లో ప్రోటోకాల్ పాటించలేదు అని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక లో వంద పడకల ఆసుపత్రి నీ పూర్తి చేయలేదు అని రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల ను దుబ్బాక లో కాకుండా, సిద్దిపేట లో ఏర్పాటు చేశారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కు రింగు రోడ్డు ఉంటుంది అని, దుబ్బాక కు ఉండదా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే వెయ్యి రెండు పడక గదులు దుబ్బాక కి అదనంగా ఇవ్వాలని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. దుబ్బాక పై వివక్ష చూపించడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట మాదిరిగా దుబ్బాక కు నిధులు కేటాయించి అభివృద్ది కి సహకరించాలి అని తెలిపారు. అంతేకాక దుబ్బాక కి ఒక కొత్త బస్టాండ్ ను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక సిద్దిపేట కి అంతర్జాతీయ విమానాశ్రయం ఇస్తే, దుబ్బాక కి ఇవ్వరా అంటూ సూటిగా ప్రశ్నించారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి 155 కిలో మీటర్ల పరిధిలో మరొక విమానాశ్రయం ఉండొద్దు అని అగ్రిమెంట్ ఉంది, ఈ విషయం సీఎం కి తెలియదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కేసీఆర్ వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.