స్పీకర్ తమ్మినేని ను కలిసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్

Thursday, March 25th, 2021, 04:04:22 PM IST

ganta-srinivas-rao

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ వ్యవహారం పట్ల బగ్గుమన్నయి. నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు రావు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయానికి గానూ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే నేడు శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ను ఆముదాలవలస లో గంటా శ్రీనివాసరావు కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ తను చేసిన రాజీనామా ను ఆమోదించాలి అని తెలిపారు. అయితే వారం రోజుల్లో అమరావతికి చేరి స్పందిస్తా అని వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.