కరోనా బాధితులకు కిట్లు పంపిన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ!

Thursday, May 13th, 2021, 02:39:05 PM IST

mla_balakrishna
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు రాష్ట్రం లో నమోదు అవుతున్నాయి. అయితే ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ తన హిందూపురం నియోజక వర్గం లోని కరోనా బాధితులకు మందులను పంపించారు. అయితే దాదాపు 20 లక్షల రూపాయల విలువ చేసే కిట్లను కరోనా వైరస్ భారిన పడిన రైతులకు అందజేశారు. అయితే హైదరాబాద్ నుండి వచ్చినటువంటి కోవిడ్ మందులను హిందూపురం నియోజక వర్గం కి చెందిన తెలుగు దేశం పార్టీ నేతలు పంపిణీ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి పక్ష వేల సంఖ్యలో కేసులు, పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పగటి పూట కర్ఫ్యూ అమలు లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.