బిగ్ న్యూస్: టీడీపీ పొలిట్ బ్యూరో లోకి బాలకృష్ణ…ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న!

Monday, October 19th, 2020, 01:28:40 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కమిటీలను తాజాగా ప్రకటించారు. అయితే ఈ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గా కింజరాపు అచ్చెన్నాయుడు ను ఎన్నుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గా ఎల్.రమణ మరోమారు నియమితులు అయ్యారు. 27 మంది సభ్యులతో కేంద్ర కమిటీని, 25 మంది సభ్యులతో పొలిట్ బ్యూరో ను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక 31 మంది తో తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ ను ఏర్పాటు చేయడం జరిగింది. వారిని నేడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

అయితే కేంద్ర కమిటీ లో గల్లా అరుణకుమారి, ప్రతిభా భారతి, సత్యప్రభ తో పాటుగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే నాగేశ్వర్ రావు, కాశీనాథ్ ఉపాధ్యక్షులు గా వ్యవహరించనున్నారు. పార్టీ కి జాతీయ ప్రధాన కార్యదర్షులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్ నాయుడు, నిమ్మల రామానాయుడు, రవి చంద్ర యాదవ్ లతో పాటుగా కొత్తకోట దయాకర్ రెడ్డి, బక్కని నరసింహులు, రామ్మోహన్ రావు నియమితులు అయ్యారు. అదే తరహాలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ను పొలిట్ బ్యూరో లోకి తీసుకోగా, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు, బోండా ఉమా,గొరంట్ల బుచ్చయ్య చౌదరి, గల్లా జయదేవ్, ఫరూక్, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యా రాణి తదితరులను పొలిట్ బ్యూరో సభ్యులు గా ప్రకటించారు.

హిందూపురం నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా గెలుపొందగా, ఇప్పుడు పొలిట్ బ్యూరో లోక్ అడుగు పెట్టడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.