వైసీపీ ప్రభుత్వం రైతులకి తీరని అన్యాయం చేస్తోంది – బాలకృష్ణ

Wednesday, January 6th, 2021, 02:30:22 PM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత బాలకృష్ణ అనంతపురం లో నీ పలు ప్రాంతాల్లో పర్యటించారు. హిందూపూర్ లోని గొలాపురం, ఫైర్చి మత్తూరు లో బాలకృష్ణ పర్యటించారు. అయితే గోలా పురం లో కంది పంటను, ఫైర్చీ మత్తూరు లో మొక్క జొన్న పంటలను పరిశీలించారు. అయితే ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు ప్రభుత్వం అని భూటకపు హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చిన వైసీపీ, రైతులకు తీరని అన్యాయం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తక్షణమే పంట నష్ట పరిహారం చెల్లించాలి అని బాలకృష్ణ డిమాండ్ చేశారు. అయితే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎరువుల విత్తనాలను రైతులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. అయితే పంట నష్టపోయిన రైతుల జాబితాలో చిల మత్తూరును చేర్చాలి అంటూ బాలయ్య ప్రభుత్వం కి సూచించారు. అయితే ప్రతి పక్షాలు యంత్రాంగాన్ని నడపడంలో ఒక భాగం అని, తాము ఇచ్చే సూచనలు ప్రభుత్వం పరిగణన లోకి తీసుకోవాలి అని బాలయ్య అన్నారు. అయితే ఢిల్లీ తరహాలో రైతులు ఇక్కడ తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని బాలకృష్ణ అన్నారు. బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.