ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నేను నిలదీస్తూనే ఉంటాను – అచ్చెన్నాయుడు

Thursday, September 3rd, 2020, 03:00:20 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ నేత, ఎమ్మెల్యే అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తప్పులు నిలదీయడం నేను చేసిన తప్పు అయితే, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నేను నిలదీస్తూ నే ఉంటాను అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సర్కారు అవినీతి ను ప్రశ్నించడమే నేరం అయితే ఎన్ని అక్రమ కేసుల పెట్టినా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను అని అన్నారు. నిజాయితీ నా ధైర్యం అని, సత్యం నా ఆయుధం అంటూ అచ్చెన్న పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజా క్షేమమే తన లక్ష్యం అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఈ ఎస్ ఐ అక్రమాల పేరు తో అక్రమ కేసులో ఇరికించారు అని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు అని పేర్కొన్నారు. అక్రమ అరెస్ట్ ను ఖండించారు అని, అనారోగ్యం గా ఉంటే కోలుకోవాలని ప్రార్థించారు అని తెలిపారు. అయితే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. బెయిల్ పై రావడం పట్ల టీడీపీ, వైసీపీ అభిమానులు ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు.