ఎన్టీఆర్ వారసులకు పౌరుషం ఉంటే టీడీపీకి ఈ గతి పట్టేది కాదు – అంబటి రాంబాబు

Tuesday, March 30th, 2021, 03:33:36 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ లోకి చంద్రబాబు నాయుడు ఒక విష సర్పం లా చేరారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే సోమవారం జరిగిన తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంతర్ధాన దినోత్సవం లా జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే దివంగత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజున చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఉన్నారు అని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ లో ఓడిన తర్వాతే చంద్రబాబు టీడీపీ లో చేరారు అని అంబటి రాంబాబు అన్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కి అభ్యర్ధులు కూడా దొరకరు అని అంబటి రాంబాబు అన్నారు. ఎన్టీఆర్ వారసులకు పౌరుషం ఉంటే టీడీపీకి ఈ గతి పట్టేది కాదు అని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శిధిలావస్థకి చేరింది అని అన్నారు. రాష్ట్ర సంక్షేమం కొరకు ప్రజలు వైసీపీ కి పట్టం కట్టారు అని, చంద్రబాబు హయాంలో 132 శాతం కి అప్పులు చేశారు అని మండిపడ్డారు. అంతేకాక టీడీపీ కార్యకర్తలకు డబ్బులు దోచి పెట్టారు అని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు లక్షల కోట్లను టీడీపీ నేతలకు దొచిపెట్టారు అని, చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్తితి లేదని స్పష్టం చేశారు.