మలేషియా విమానాన్ని ఎవరైనా హైజాక్ చేసారా?

Saturday, March 15th, 2014, 04:44:35 PM IST

fiyit
వారం క్రితం కనబడకుండా పోయిన మలేషియా విమాన వ్యవహరం కొత్త మలుపు తిరిగింది. విమానాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత శనివారం తెల్లవారుజామున చివరిసారిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయిన తర్వాత ఈ విమానం చాలా గంటలపాటు ప్రయాణించి ఉండొచ్చన్న సంకేతాలు లభించాయి. దీనితో విమానం కోసం కొనసాగుతున్న అంతర్జాతీయ గాలింపును శుక్రవారం హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి విస్తరింపజేసారు.అదృశ్యమైన తర్వాత ఈ విమానం దాదాపు నాలుగు గంటలపాటు ఒక ఉపగ్రహానికి సిగ్నల్స్‌ను పంపించిందని అధికారులు చెబుతున్నారు.మలేషియా ప్రధాన మంత్రి కూడా ఈ వార్తలను ద్రువికరిస్తునట్టు సమాచారం.