బిగ్ న్యూస్: ఏపీ మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్..!

Monday, September 28th, 2020, 07:21:45 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎవరి నుంచి కరోనా సోకుతుందో ఎవరికి అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు, డాక్టర్లతో పాటు ప్రజలలో ఎక్కువగా తిరిగే ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్య ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.

అయితే ఇప్పటికే అధికార పార్టీ వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలలోనే ఉన్నారు. అయితే ఈనెల 25వ తేదీన విజయవాడకు వచ్చిన వెల్లంపల్లి స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అయితే పరీక్షలలో పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.