ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Wednesday, October 21st, 2020, 04:28:35 PM IST

ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రి లో చేరిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి లో చేరిన ఆయన పూర్తి ఆరోగ్యం తో కోలుకోవడం తో డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. అయితే విజయవాడ కనకదుర్గమ్మ ఆశీసుల తో కొలుకొన్నట్లు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అంతేకాక ఇటువంటి సమయం లో తనకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యే లకు, అభిమానులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అయితే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పలువురు నేతలు, ఎమ్మెల్యే లు, మంత్రులు, ఎంపీ లు సైతం కరోనా వైరస్ భారిన పడి కోలుకున్నారు. అయితే ఇంకా ఈ వైరస్ ఉదృతి కొనసాగుతుండటం తో ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని వైద్యులు మరియు నిపుణులు సూచిస్తున్నారు.