ఏపీలో కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతుంది. గత రెండు మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అయితే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి మాత్రం కరోనా తగ్గడంలేదు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
అయితే గత నెల సెప్టెంబర్ 28వ తేదీన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. అయితే అప్పటి నుంచి ఆయన 14 రోజులుగా చికిత్స తీసుకుంటున్నా తగ్గడం లేదు. తాజాగా ఆయనకు జ్వరం, నీరసంగా అనిపించడంతో చికిత్స కోసం హైదరాబాద్ వచ్చారు. అయితే ఏపీలో ఇప్పటి వరకు చాలా మందికి కరోనా సోకగా, చాలా మంది నేతలు హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందారు.