బీజేపీ నేతలు పాతబస్తీలో ఎందుకు తిరగడంలేదు – మంత్రి తలసాని

Saturday, November 28th, 2020, 07:22:06 AM IST

గ్రేటర్ ఎన్నికల ప్రచారం వాడీ వేడీగా సాగుతుంది. పార్టీల మధ్య, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తాజాగా మంత్రి తలసాని బీజేపీపై మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఇంత మంది కేంద్ర మంత్రులు రావడం నిజంగా సిగ్గుచేటని అన్నారు. అసలు వారందరికి జీహెచ్‌ఎంసీ పరిధిలోకి ఏయే అంశాలు వస్తాయన్న కనీస పరిజ్ఞానం కూడా లేదని, జీహెచ్‌ఎంసీ పరిధిలోనే లేని అంశాలనూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని ఎద్దేవా చేశారు.

అయితే ఓట్ల కోసం వరద సాయాన్ని 25 వేలు ప్రకటించిన బీజేపీ నేతలు, అందుకు జీవోను కేంద్ర ప్రభుత్వంతో ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో బీజేపీ, మజ్లీస్ గొడవలు సృష్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు. మజ్లిస్‌ పార్టీ పరిధి చాలా చిన్నదని, ఆ పార్టీపై ఇంతగా మాట్లాడుతున్న బీజేపీ నేతలు పాతబస్తీలో ఎందుకు తిరగడం లేదని ప్రశ్నించారు.