బండి సంజయ్ ఎవరిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారు – మంత్రి తలసాని

Thursday, November 26th, 2020, 01:02:23 AM IST


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యం లో ఒకరి పై మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి పక్ష నేతల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ పార్టీ అన్ని తప్పుడు హామీలు ఇస్తుంది అని మంత్రి వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మరియు వరద సమయాల్లో ప్రజలను ఆదుకుంది తెరాస ప్రభుత్వం అని మరొకసారి స్పష్టం చేశారు. అయితే ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి గట్టి సమాధానం ఇచ్చారు. బండి సంజయ్ ఎవరి పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారో చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎం ఐ ఎం పై కూడా మంత్రి తలసాని నిప్పులు చెరిగారు. అనవసరపు విమర్శలు చేస్తోంది అని అన్నారు. అయితే వరద నష్టం పై కేంద్రానికి నివేదిక ఇచ్చి రెండు నెలలు అయినా అతీగతీ లేదు అని విమర్శించారు. అయితే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముందు తన నియోజక వర్గం చూసుకుంటే బావుంటుంది అని సెటైర్స్ వేశారు. కరీం నగర్ లో ఉండే బండి సంజయ్ కి హైదరాబాద్ గురించి ఏం తెలుసు అని, హైదరాబాద్ లో సర్జికల్ స్ట్రైక్ చేస్తారా, మీకు నచ్చకపోతే దేశ బహిష్కరణ చేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.