కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది?

Thursday, January 21st, 2021, 09:33:04 AM IST

తెలంగాణ రాష్ట్రం లో తెరాస రెండవసారి అధికారం చేపట్టినప్పటి నుండి, ఆ తర్వాత ఎవరు సీఎం అవుతారు అనే ప్రశ్న చాలా మందిలో మెదిలింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ పై ప్రతి పక్షాలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాయి. కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ వస్తున్న ఊహాగానాల పై ప్రతి పక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వ్యవహారం పై స్పందించారు. ప్రతి పక్షాలకి గట్టి కౌంటర్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది అంటూ చెప్పుకొచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్. సీఎం పదవికి ఆయన అన్ని విధాలా సమర్థుడు అని, కేటీఆర్ ను సీఎం చేయడానికి సీఎం కేసీఆర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు. మహమూద్ అలి సైతం ఇదే తరహాలో సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్ దాని పై త్వరలో నిర్ణయం తీసుకుంటారు అని అన్నారు.