ఆరేళ్లు ఎమ్మెల్సీగా ఉన్న రాంచందర్ రావు ఏం చేశారు – మంత్రి తలసాని

Thursday, March 4th, 2021, 04:05:02 PM IST

తెలంగాణ రాష్ట్రం లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్షాలు ఒకరి పై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన రాంచందర్రావు పై అధికార పార్టీ తెరాస కి చెందిన నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పస్తామని చెప్పి, ఉన్న ఉద్యోగాలకు బీజేపీ ఎసరు పెడుతోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆరేళ్లు ఎమ్మెల్సీ గా ఉన్న బీజేపీ అభ్యర్ధి రాం చందర్ రావు పట్ట భద్రుల కోసం ఏం చేశారో సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం లక్షా 32 వేల ఉద్యోగాలను కల్పించింది అని, మరో 50 వేల ఉద్యోగాల భర్తీ కి ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు.

అయితే ఈ మేరకు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్ధి వాణీ దేవి తో పాటుగా తెరాస నేతలు, మంత్రులు ప్రచారం లో పాల్గొన్నారు. రాష్ట్రం లో అభివృద్ది కొనసాగాలి అంటే తెరాసను గెలిపించాలని కోరారు.