ఎన్నికలు ఏవైనా తెరాస దే విజయం – మంత్రి తలసాని శ్రీనివాస్

Sunday, November 1st, 2020, 08:00:52 PM IST

తెలంగాణ రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ల నుద్దేశించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జీ హెచ్ ఎం సి ఎన్నికల్లో మొత్తం 150 సీట్ల లో, 104 సీట్లలో విజయం సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక ఇటీవల భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి నేడు మీడియా సమావేశం లో తెలిపారు.

ఈ మేరకు బాడితులందరికి కూడా భరోసా అందుతుంది అని హామీ ఇచ్చారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువు అయ్యారు అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించడం ఖాయం అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రం లో ఎన్నికలు ఏవైనా తెరాస దే విజయం అని అన్నారు. అంతేకాక దుబ్బాక ఉపఎన్నిక గురించి సైతం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక లో బీజేపీ నాయకులు గో బెల్స్ ప్రచారం తో గెలవాలని పరితపిస్తున్నారు అని, వారి ఆశలు ఇప్పట్లో నెరవేరవూ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేసారు.