దేశంలో మద్యం నిషేదిస్తే తెలంగాణలో కూడా నిషేదిస్తాం – మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

Wednesday, March 24th, 2021, 03:02:51 AM IST


మద్యపాన నిషేదంపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలను నిషేధిస్తే తెలంగాణలో కూడా మద్యాన్ని నిషేధిస్తామని స్పష్టం చేశారు. దేశమంతా మద్యం షాపులు ఓపెన్ చేసి తెలంగాణలో బంద్ చేస్తే ప్రయజనం ఉండదని, అప్పుడు రాష్ట్రంలో మాఫియా పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. అయితే మద్యం నిషేదంపై దేశవ్యాప్తంగా ఓ నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేయడంలో తాము ముందుంటామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ తెలిపారు.

ఇదిలా ఉంటే నేడు అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నవ్వులు పూయించారు. సభ్యులు సమయం పరిగణలోకి తీసుకొని మాట్లాడాలని స్పీకర్ పోచారం చెప్పగా, సార్.. మీరు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి గంట వరకు సమాధానం ఇచ్చారని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మేం పని చేస్తున్నామని, ఇప్పుడు సమయం గుర్తు చేస్తున్నారా అని అన్నారు.