కల్లు తాగుతూ నవ్వులు పూయించిన తెలంగాణ మంత్రులు..!

Friday, January 29th, 2021, 06:12:16 PM IST

తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు నేడు జనగామ జిల్లాలోని రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళే మార్గమధ్యలో గీత కార్మికులు కనబడడంతో వారి వద్దకు వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాటివనంలో గీత కార్మికుడు చెట్టు ఎక్కి కల్లు తీసుకురాగా ఇద్దరు మంత్రులు తాటి కమ్మలో కల్లు సేవించారు.

అయితే తొలుత మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కల్లు తాగుతుండగా మొత్తం కల్లు తాగేస్తారని మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు వేశారు. అలాగే శ్రీనివాస్ గౌడ్ కూడా జోక్‌లు వేస్తూ నవ్వులు పూయించారు. ఇదంతా బాగానే ఉన్నా ఓ అధికారిక కార్యక్రమానికి వెళుతూ ఇలా కల్లు తాగడం, అది పక్కన మహిళలు ఉన్న సమయంలో మంత్రులు ఇలా చేయడం ఏమీ బాగోలేదంటూ కొందరు మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.