తెలంగాణలో 6,7,8 తరగతులు రేపటి నుండి పునః ప్రారంభం

Tuesday, February 23rd, 2021, 04:00:50 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగా విద్యార్థులు స్కూళ్లకు సెలవులు వచ్చాయి. అయితే రేపటి నుండి 6,7,8 చదువుతున్న విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి అని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే రేపటి నుండి మార్చి ఒకటవ తేది వరకు తరగతులను ప్రారంభించుకోవచ్చు అని మంత్రి తెలిపారు. అయితే పాటశాల లకు హాజరు అయ్యే విద్యార్థులు తప్పని సరిగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలి అని సూచించారు. అయితే విద్యార్థులు పాటశాల లకు వెళ్ళాలి అంటూ తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే పాటశాల ల పునః ప్రారంభం అవ్వడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.