విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఆందోళన వద్దు – మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Monday, January 18th, 2021, 04:15:01 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణం గా లాక్ డౌన్ అమలు లో పాటశాలలు, కళాశాల లు మూత పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే విద్యా సంస్థలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, సి ఎస్ సోమేష్ కుమార్ విద్యా సంస్థలు, గురుకులాలు, వసతి గృహాలు తెరవడం పై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

విద్యా సంస్థలను ప్రారంభించేందుకు ఈ నెల 25 లోపు సిద్దం కావాలి అంటూ సూచించారు. అంతేకాక తరగతి గదులలో విద్యార్థుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 1 నుండి 9 వ తరగతి ఆ పై కోర్సులకు తరగతులను ప్రారంభించాలి అని సమావేశం లో తెలియజేశారు. అయితే విద్యార్థుల ఆరోగ్యం విషయం లో ఆందోళన వద్దు అని, విద్యార్థుల భవిష్యత్ ను కూడా దృష్టి లో ఉంచుకోవాలి అని అన్నారు. పుస్తకాలు, యూనిఫారం లు ఇప్పటికే చెరవేశాం అని అన్నారు. అంతేకాక విద్యార్థుల హాజరు విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదు అని తెలిపారు.