కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కి సోకిన కరోనా

Tuesday, October 27th, 2020, 04:02:58 PM IST

కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టినా, పూర్తి స్థాయిలో దీని ప్రభావం మాత్రం తగ్గడం లేదు. తాజాగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కరోనా వైరస్ భారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ వేదిక గా వెల్లడించారు. తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే వైద్యుల సలహా మేరకు ఆసుపత్రి లో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయితే తనతో గత కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉన్నవారు, కలిసిన వారు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కోవాలి అని సూచించారు.

అయితే సోమవారం నాడు పాయల్ ఘోష్ పొలిటికల్ ఎంట్రీ కారణం గా ఒక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. పాయల్ ఘోష్ ను మహిళా ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ పార్టీ శ్రేణులు కలవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో అంత కూడా మాస్క్ లు ధరించినప్పటికి కూడా పూర్తిగా కవర్ చేసుకోలేదు. అయితే తాజాగా మంత్రి కరోనా వైరస్ భారిన పడటంతో మిగతా వారిలో ఆందోళన మొదలు అయినట్లు తెలుస్తోంది.