నీ జాతకం విప్పితే బజారు పాలైతవ్.. నారాయణకు పువ్వాడ కౌంటర్..!

Thursday, December 3rd, 2020, 01:00:08 AM IST

తెలంగాణ మంత్రి పువ్వాడ సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యలపై వ్యాఖ్యలు చేశారు. నిన్న గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూకట్‌పల్లి ఫోరంమాల్ వద్ద మంత్రి పువ్వాడ కారు మీద దాడి జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి కారులో డబ్బులు పెట్టుకుని వచ్చారనే అనుమానంతో బీజేపీ నేతలు దాడికి దిగారు. కారు బ్యానెట్ మీద ఓ యువకుడు ఎగిరి కూర్చోగా, మరో యువకుడు కారు వెంట పడ్డాడు. అయిన మంత్రి కారు అలానే పోనివ్వడంపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు.

ఓ వ్యక్తి బానెట్ మీద పడుకుని ఉన్న సమయంలో కారును వేగంగా తీసుకుని వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఒకవేళ ఎవరైనా చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటని, కారులో డబ్బులు లేకపోతే ఎందుకు ఆపకుండా వెళ్లిపోయారని సందేహం వ్యక్తం చేశారు. అంతేకాదు మంత్రి అజయ్‌ను కేబినెట్ నుంచి తప్పించాలని నారాయణ డిమాండ్ చేశారు. అయితే నారాయణ వ్యాఖ్యలకు మంత్రి అజయ్ ఘాటుగా స్పందించారు. నారాయణ ఎప్పుడు బీజేపీలో చేరారని వ్యంగ్యంగా మాట్లాడారు.

అంతేకాదు పువ్వాడ పేరు వింటేనే ఆయన ప్యాంటు తడుస్తుందని అన్నారు. నాన్న దగ్గర దాయం పొంది ఆయనకే దెబ్బేశావ్ అని నీ జాతకం విప్పితే బజారు పాలవుతావ్ అని అన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా ప్రజలు గెలిపించారని, నువ్వు ఎప్పుడైనా నేరుగా గెలిచావా అని ప్ర్శ్నించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడని లేదంటే కేసీఆర్ వదిలేసిన నీ చెవు తెగ్గుద్ది బిడ్డా అని హెచ్చరించారు.