బ్రేకింగ్: అదే బీజేపీ తో పొత్తు అంటారు…మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!

Monday, January 27th, 2020, 04:57:00 PM IST

శాసన మండలి రద్దు బిల్లుని అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన జగన్, దానిపై చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ సమావేశం లో మంత్రి పేర్ని నాని చంద్రబాబు, లోకేష్ ల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రామాయణంలో రాక్షసులు యజ్ఞాన్ని అడ్డుకున్నట్లుగా, వైయస్ జగన్ ఆశయాలని, చంద్రబాబు మరియు లోకేష్ లు అడ్డుకుంటున్నారని అన్నారు. చారిత్రాత్మక బిల్లుల్ని అడ్డుకొని టీడీపీ శునకానందం పొందుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ ల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

అంతేకాకుండా చంద్రబాబు ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి కాదంటూ విమర్శలు చేసారు. అయితే రాష్ట్రాన్ని విడగొట్టాలని లేఖ ఇస్తారు, మళ్ళీ రాష్ట్రాన్ని ఎలా విడగొడతారని ప్రశ్నలు గుప్పిస్తారు, బీజేపీ మతతత్వ పార్టీ అంటారు, అదే బీజేపీ తో పొత్తు అంటారు అని మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి హోదా అవసరం అని చెప్పి, ప్యాకేజీని స్వాగతించడం పట్ల ఆగ్రహము వ్యక్తం చేసారు. చంద్రబాబు తీరుని అసెంబ్లీ సాక్షిగా దుయ్యబట్టారు.