రాజీనామాలు చేస్తే ఉపయోగం ఏమిటి.. మంత్రి పెద్దిరెడ్డి సూటి ప్రశ్న..!

Wednesday, March 10th, 2021, 01:13:49 AM IST


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం నిన్న మరోసారి తేల్చి చెప్పడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని ప్రతిపక్ష టీడీపీ ఒత్తిడి చేస్తుంది. అయితే దీనిపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏంటి అని ప్రశ్నించారు.

అంతేకాదు రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అని నిలదీశారు. కేంద్రంపై అంతా కలిసి పోరాడి సాధించాలని, రాజీనామాలు పరిష్కారం కాదని అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలన్న ఆలోచన సీఎం జగన్‌కు ఉందని, టీడీపీ నేతలు చెబితే మేము వినాలా అని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో చంద్రబాబు ఉక్రోషంతో మాట్లాడుతున్నారని, మళ్ళీ ఎన్నికలు వస్తే వైసీపీ 170 స్థానాలు గెలుస్తుందని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.