కబడ్డీ ఆడుతూ కాలు జారి కిందపడ్డ మంత్రి మల్లారెడ్డి..!

Wednesday, March 31st, 2021, 02:17:19 AM IST

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆటైనా, పాటైనా, ఏ విషయంలో నైనా ముందుంటారు. తన కాలేజీలో జరిగే ఫంక్షన్లు, ఇతర వేదికలపై స్టెప్పులు, అతని మాటలు అందరిని కడుపుబ్బా నవ్వించుకునేలా చేస్తుంటాయి. అయితే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతోన్న 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా మరియు పురుషుల కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరచాలనుకున్నాడు.

అయితే కబడ్డీ కోట్‌లో కూతకువెళ్లిన ఆయన ఆట సమయంలో కాలు కాస్త పైకి ఎత్తి జారిపడిపోయారు. వెంటనే మిగతావారు వచ్చి ఆయనను లేపారు. ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆయనే నవ్వుకుంటూ పోటీలను కొనసాగించాలని చెప్పడంతో పోటీలు యథావిథిగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు మల్లారెడ్డితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, కసాని జ్ఞానేశ్వర్, మేయర్లు బుచ్చిరెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు హాజరు అయ్యారు.