కేసీఆర్ ప్రధాని అయితే దేశ చరిత్ర మారిపోతుంది.. మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Thursday, March 25th, 2021, 08:49:04 PM IST

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎప్పుడేది మాట్లాడినా అది ఆసక్తిగానో, సంచలనంగానో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట తీరే అంత. అయితే తాజాగా నేడ్దు శాసనసభలో మాట్లాదిన మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ ప్రధాని అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్తారని అన్నారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని చెప్పుకొచ్చారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు.

ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ అన్ని సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని అన్నారు. బీజేపీ విధానాల వల్ల కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలను తెలంగాణలో అమలు అవుతున్నాయని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను ప్రధాని చేయాలని, ఆయన ప్రధాన మంత్రి అయితే దేశ చరిత్ర పూర్తిగా మారిపోతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.