చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటే – మంత్రి కురసాల కన్నబాబు

Monday, December 7th, 2020, 08:40:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మరోమారు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ మెప్పు కోసం ఢిల్లీ లో పొగడ్తల వర్షం కురిపించి, ఇక్కడ రాష్ట్రం లో లబ్ది పొందేందుకు కలరింగ్ ఇస్తున్నారు అని విమర్శించారు. వ్యవసాయ బిల్లు పై ముగ్గురు టీడీపీ ఎంపీ లు గట్టిగా వాదించినట్టు, వైసీపీ ఎంపీ లు గళం విప్పలేదు అన్నట్లు చంద్రబాబు మాట్లాడటం దారుణం అని కన్నబాబు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎవరు ఏం మాట్లాడారు అనేది ప్రజలందరికీ తెలుసు అంటూ కన్నబాబు చెప్పుకొచ్చారు.

వ్యవసాయ బిల్లుని వ్యతిరేకిస్తున్నట్లు చంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదు అని సూటిగా ప్రశ్నించారు. మోడీ కి ఈరోజు అయిన బాబు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట మాట్లాడటం టీడీపీ కి, చంద్రబాబు కే చెల్లింది అంటూ కన్నబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రం లో లేని విధం గా రైతుల కోసం జగన్ విప్లవత్మాక చర్యలకు శ్రీకారం చుట్టారు అని అన్నారు. చంద్రబాబు కి అవేమీ తెలియవా లేకపోతే తెలిసే నటిస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే వైసీపీ 18 నెలల పాలన పై, టీడీపీ అయిదేళ్ల పాలన పై చర్చకు సిద్దంగా ఉన్నారా అంటూ కన్నబాబు సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో ఏనాడూ కూడా రైతుల గురించి ఆలోచించలేదు అని, పాడి రైతులకు అన్యాయం చేశారు అని, సహకార డైరీ లను నిర్వీ ర్యం చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మేము ప్రతి పక్షం లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అధికార పార్టీ ను కాకుండా, మమ్మల్ని ప్రశ్నించేవారు,ఇప్పుడు ప్రశ్నించడం లో ఆశ్చర్యం ఏముంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటే అని, దీక్షలు చేయాల్సిన అవసరం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక వైసీపీ ఎప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంది అంటూ పేర్కొన్నారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.