కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కేటీఆర్‌ లేఖ.. ఏం కోరారంటే?

Thursday, December 24th, 2020, 02:00:18 AM IST

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని లేఖ ద్వారా కోరారు. అయితే హైదరాబాద్-వరంగల్ మరియు హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు హైదరాబాద్ ఫార్మా సిటీకి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్లను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కాబట్టి వీటికి కావాల్సిన కనీసం 50 శాతం నిధులను రానున్న బడ్జెట్‌లో కేటాయించాలని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆలోచనలను ఫార్మా సిటీతో తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకుపోతుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ఇదే కాకుండా నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రాథమిక మూలధనాన్ని కూడా వెంటనే అందించాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.